ఎలక్ట్రానిక్స్ తయారీ స్కీం కోసం రూ. 1.15 ల‌క్ష‌ల కోట్లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర మంత్రి అశ్విన వైష్ణ‌వ్

hellotelugu-ashwinivaishnaaw

ఢిల్లీ : కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం కింద త‌మ ప్ర‌భుత్వం రూ.1.15 లక్షల కోట్ల ప్రతిపాదనలు త‌యారు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గురువారం మ‌హాత్మా గాంధీ జ‌యంతి సంద‌ర్బంగా మ‌హాత్మునికి నివాళులు అర్పించారు. అంతే కాకుండా ఇవాళ దేశ వ్యాప్తంగా ద‌స‌రా పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు అశ్విని వైష్ణ‌వ్. ఈ స్కీం కింద 1.4 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే ఛాన్స్ ఉంద‌న్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం రూ.1.15 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను త‌యారు చేశామ‌న్నారు అశ్విని వైష్ణ‌వ్.

పెట్టుబడి, ఉద్యోగాలు, ఉత్పత్తి లక్ష్యాలను మించి పోయిందని కేంద్ర ఐటీ మంత్రి తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. పథకాన్ని రూపొందించే సమయంలో నిర్దేశించిన లక్ష్యాలతో పోలిస్తే ఈ ప్రతిపాదనలు పెట్టుబడి, ఉపాధి, ఉత్పత్తి లక్ష్యాలను అనేక రెట్లు మించి పోయాయని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం కోసం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30న ముగిసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా కేంద్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1,15,351 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు అశ్విని వైష్ణ‌వ్. ఈ పథకం కింద ప్రభుత్వం దాదాపు రూ. 59,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని చెప్పారు. మూలధన పరికరాల విభాగాలకు దరఖాస్తు విండో ఇంకా తెరిచి ఉందని ఆయన అన్నారు.

Exit mobile version