Ukraine : ఉక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియాను నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ.పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం ఉక్రెయిన్ రెండో మహిళా ప్రధాని కానున్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వంలో మొదటి డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో అమెరికా, ఐరోపాతో ఆర్థిక సహకారం పెంపొందించడంతో పాటు రక్షణ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో తనకే ప్రయారిటీ ఇచ్చారు.
Ukraine New Prime Minister Updates
ప్రస్తుతం పాలనా పరంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్వైరిడెంకోకు (Yulia Svyrydenko) కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రష్యాతో యుద్దం కొనసాగుతోంది. అమెరికాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఉక్రెయిన్ చీఫ్ తో సంభాషించారు. రష్యాతో వైరం మంచిది కాదని, సాధ్యమైనంత మేర ఇరు పక్షాలు ఒక అవగాహనకు రావాలని సూచించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు జెలెన్ స్కీ.
పాలనా పరంగా గత కొంత కాలంగా కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు యూలియా స్వైరిడెంకో. ఆమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. ఆమె ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారు. 2021 నుండి మొదటి డిప్యూటీ పీఎంగా పని చేశారు. అమెరికాతో ఖనిజ ఒప్పందం కోసం ఇటీవలి చర్చలలో ముఖ్య భూమికను పోషించారు. ఇదే సమయంలో మరో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న ష్మిహాల్ ను ప్రతిపాదించారు. ఈ పదవికి తనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు జెలెన్ స్కీ ఈ సందర్బంగా.
Also Read : AP Govt Interesting Update : జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగించిన సర్కార్

















