Keir Starmer : ముంబై : బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. బుధవారం ముంబైలో ఆయన కాలు మోపారు. ఆ వెంటనే ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా సౌండ్-మిక్సింగ్ డెస్క్‌ను చూశారు. ఇదిలా ఉండగా లండన్, న్యూఢిల్లీ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. కొన్ని నెలల తర్వాత స్టార్మర్ ఇవాళ భారత దేశ పర్యటనకు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన దేశ ఆర్థిక రాజధానిని సందర్శించడం విశేషం. పదేళ్ల అనంతరం తీవ్రమైన చర్చలకు దారి తీసింది ఈ సందర్శన. తన పర్యటనలో భాగంగా ముంబైలోని అంధేరీ శివారులోని యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోను సందర్శించడం విస్తు పోయేలా చేసింది. ఇది కీలకమైన బాలీవుడ్ నిర్మాణ కేంద్రంగా ఉంది.
UK PM Keir Starmer Visit
కాగా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం, బ్రిటిష్, భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పర్యటన లక్ష్యమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి స్టార్మర్. లండన్ నుండి విమానంలో వచ్చిన స్టార్మర్ భారీ పోలీసు భద్రత మధ్య యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోకు చేరుకున్నారు. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలతో సహా సృజనాత్మక భాగస్వామ్యాలను పెంపొందించే దిశగా సాగుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి తన టూర్ లో చలనచిత్రం, క్రీడలు, వాణిజ్య రంగాలలో ఇరు దేశాల మధ్య మరింత సంబంధాలను పెంపొందించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
Also Read : Popular Actress Nayanthara – Bomb Threats : నటి నయనతార ఇంటికి బాంబు బెదిరింపు


















