Aadhaar : ఢిల్లీ – యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. భారత దేశంలోని పౌరులు, పిల్లలు ఎవరైనా సరే ఆధార్ కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఆధార్ (Aadhaar) కార్డుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఐదేళ్లు దాటాక పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. 7 ఏళ్లు దాటినా అప్ డేట్ గనుక చేయక పోతే డీ యాక్టివేట్ అవుతుందని పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్, ఐరిస్ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని ఇప్పటి వరకు జారీ చేస్తూ వచ్చింది. కాగా ఐదు నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే ఉచితమని, ఏడేళ్లు దాటిన పిల్లలకు రూ.100 చెల్లించాలని స్పష్టం చేసింది.
Aadhaar Important Update
7 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్‌లను నవీకరించడంలో విఫలమైతే ఆధార్ డీ యాక్టివేట్ అవుతుందని హెచ్చరించింది. నవీకరించబడిన బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుంది. సేవలను పొందడంలో సజావుగా వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడు ఆధార్ పొందిన పిల్లలు, ఏడు సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను తప్పనిసరిగా అప్ డేట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది, లేకుంటే వారు వారి ప్రత్యేక ఐడిని కోల్పోతారని పేర్కొంది.
తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణకు సంబంధించ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పిల్లల ఆధార్‌లో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌లకు SMS సందేశాలను పంపడం ప్రారంభించింది.
Also Read : Anand Mahindra Inspiring Story : తన 44 ఏళ్ల జీవిత చరిత్రను పంచుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త


















