TWJF : హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహాసభల నిర్వహణ కార్యక్ర మాల కోసం అడహక్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. అలాగే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితూడి బాపూరావును సంఘం నుంచి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం బహిష్కరించింది. గత కొంతకాలంగా వీరంతా సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో సంఘం ఐక్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించింది. ఫెడరేషన్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని, కుల, మత, వర్గ ప్రస్తావనలు తెస్తూ సంఘంలో అనైక్యతకు కారణమవుతున్నారని పేర్కొంది. అంతేగాక సంఘం పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
TWJF Shocking Decision
సంఘం సభ్యత్వ రుసుంను దుర్వినియోగం చేశారని మండిపడింది. సంఘం వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సంఘం విభజనకు దారితీసేలా పోస్టులు పెడుతున్నారని మండిపడింది. గ్రూపులు, ముఠాలను ప్రోత్సహిస్తున్నారని, పద్దతి మార్చుకోవాలని అనేక పర్యాయాలు సూచించినప్పటికీ, వారిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. సంజాయిషీ కోరుతూ రాష్ట్ర కార్యవర్గం తరపున ప్రధాన కార్యదర్శి మూడుసార్లు నోటీసులు పంపినా అధ్యక్షుడు మామిడి సోమయ్యతోపాటు ఇతరులు బేఖాతరు చేశారని ఫైర్ అయ్యింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించి వీరిని బహిష్కరించాలని తీర్మానించినట్లు స్పష్టం చేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీరికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య.
Also Read : Minister Savitha Important Update : పీపీపీ తరరహా లోనే మెడికల్ కాలేజీల నిర్మాణం : సవిత


















