టీవీకే విజ‌య్ కి అంత సీన్ లేదు : ఉద‌య‌నిధి స్టాలిన్

ఆయ‌న అరుపులు, కేక‌లు, ఈల‌ల‌కు ఓట్లు రాల‌వు

hellotelugu-UdhyanidhiStaalin

చెన్నై : త‌మిళ‌నాడులో నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈనెల 23న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డీఎంకే , కాంగ్రెస్ కూట‌మి ప్ర‌స్తుతం అధికారంలో ఉంది. మ‌రో వైపు ఏఐడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇండియా కూట‌మి పోటీ ఇస్తోంది. ఈ త‌రుణంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌ముఖ జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విజ‌య్ టీవీకే పార్టీతో ముందుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు యువ‌త నుంచి ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా విజ‌య్ డీఎంకేను టార్గెట్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి సీఎం అంకుల్ పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతి, అక్ర‌మాల‌కు పాల‌న మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రీ కొడుకులు రాచ‌రిక పాల‌న‌కు తెర లేపారంటూ మండిప‌డ్డారు సీఎం స్టాలిన్, త‌న‌యుడు ఉద‌య‌నిధి స్టాలిన్ ల‌ను ఉద్దేశించి.

దీంతో ఉద‌య‌నిధి సీరియ‌స్ గా స్పందించారు టీవీకే విజ‌య్ త‌మ‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై.
మొదట విజయ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా రాజకీయ రంగంలోకి కొత్తగా ప్రవేశించేవారి నిబద్ధతను స్టాలిన్ ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు, లాల్‌గుడి నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థి పరివల్లాల్‌కు మద్దతుగా తిరుచిరాపల్లిలో జరిగిన రోడ్‌షోలో విజ‌య్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని ఒక తాత్కాలిక ప్రదర్శనతో పోల్చారు. ఇలాంటి కొత్త వారిని “పండుగ ఆకర్షణలు” అని అభివర్ణించారు. వారు అలంకరణ ప్రతిరూపాల వలె తాత్కాలికంగా దృష్టిని ఆకర్షించి, త్వరగా మసక బారిపోతారంటూ ఎద్దేవా చేశారు. డీఎంకే నాయకులు ప్రజలతో నిరంతరం సంబంధం కలిగి ఉంటారని ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version