చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా అన్నాడీఎంకేతో పొత్తు ఉందంటూ లీకు ఇచ్చారు మాజీ సీఎం. ఆ అవకాశం కూడా ఉందంటూ పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ఈ తరుణంలో కొత్తగా పార్టీ పెట్టిన, ప్రముఖ నటుడు టీవీకే విజయ్ సంచలన ప్రకటన చేశారు. పాలిటిక్స్ లో తను ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఇదే సమయంలో కేంద్రం కూడా తమిళనాడులో డీఎంకేను పాలన నుంచి దూరం చేసేందుకు అన్ని పార్టీలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఈ తరుణంలో విజయ్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు తన సామాజిక వర్గం కు బిగ్ ఓట్ బ్యాంక్ ఉండడంతో తనపై ఫోకస్ పెట్టారు.
ఈ సందర్భంగా శనివారం సంచలన ప్రకటన చేశారు టీవీకే పార్టీ చీఫ్ , స్టార్ హీరో తలపతి విజయ్ . ఈ మేరకు బీజేపీకి దేశంలో వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ఐడాలిజికల్ గా కూడా కొంత విభేదించినా చివరకు ఆ పార్టీ తోనే కలిసి వెళ్లే ఛాన్స్ ఉండబోతోందని సూచన ప్రాయంగా చెప్పాడు. ఈ సందర్బంగా తను కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ సహజ మిత్ర పక్షం అంటూ స్పష్టం చేశాడు విజయ్. ఇప్పటిక డీఎంకేతో కలిసి ఆ పార్టీ కొనసాగుతోంది. ఈ తరుణంలో తను డీఎంకేకు వ్యతిరేకంగా తమిళనాడులో గొంతు వినిపిస్తున్నాడు. తాజాగా టీవీకే విజయ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.
















