TTD : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో జూలై 2న పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 09.30 – 11.30 గం.ల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 01 – 04 గం.ల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్ప యాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
TTD Updates
గత నెల 10 వరకు శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మ వార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గృహస్తులు( ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు . వార్షిక పుష్పయాగం సందర్భంగా ఊంజల్ సేవను రద్దు చేశారు.
Also Read : TG High Court Sensational : అధికారుల ఉదాసీనతపై హైకోర్టు ఆగ్రహం



















