TTD : తిరుపతి జిల్లా : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి ఘట్టానికి చేరుకున్నారు. పంచమి తీర్థం సందర్భంగా వేలాదిగా భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పుష్కరిణి, హోల్డింగ్ పాయింట్లు, క్యూ లైన్లు, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి (TTD) సివిల్ ఎస్‌వో మురళీకృష్ణ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రాంతాన్ని 120 సీసీ కెమెరాలు, 9 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృదాలతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా నియమించారు.
TTD Programs Update
అదనపు ఎస్పీ స్థాయి అధికారుల నియామకంతో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు మానిటరింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. పుష్కరిణి కి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు నలువైపులా హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి, అక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేలా వసతి, త్రాగునీరు, ఆహార పంపిణీ, మరుగుదొడ్ల వంటి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. పుష్కరిణిలో ఒకేసారి ఎక్కువ మంది భక్తులు స్నానం చేయకుండా దశలవారీగా విడతల వారీగా పుణ్యస్నానం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసి, భక్తుల రద్దీని నియంత్రించే చర్యలను చేపట్టారు.
Also Read : Kavitha Strong Demand : రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి


















