అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాలి

జూనియర్ కళాశాలను పరిశీలించిన జేఈవో

hellotelugu-TTDJEO

తిరుపతి : ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి జేఈవో ( విద్య , ఆరోగ్యం) డా. ఏ శరత్ అధికారులను ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు . ఈ సందర్భంగా టిటిడి జేఈవో మాట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపతికన చేయాల్సిన పనులను గుర్తించి ప్రారంభ ప్రక్రియను చేపట్టాలన్నారు. కళాశాలలో 2000 మంది విద్యార్థినులు విద్నను అభ్యసిస్తున్నారని, 97% ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన తెలిపారు.

విద్యార్థినులు చదువు కునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయని ప్ర‌శంస‌లు కురిపించారు జేఈవో. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ – లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version