TTD : తిరుమల – తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 85 వేల మందికి పైగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టీటీడీ (TTD) ఒక పరిశీలనాత్మక గరుడ సేవను నిర్వహించింది.
TTD Updates
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ గరుడ సేవలో వీలైనంత ఎక్కువ మంది భక్తులు వాహన సేవను తిలకించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల లోని శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు రంగశ్రీ, దివాకర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాగా వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి అన్న, జల ప్రసాదాలను అందజేసింది. పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీవారి సేవకులు. సామాన్యులకు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినటట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Also Read : Varalakshmi Vratam Interesting : శ్రీ పద్మావతి ఆలయంలో అష్టలక్ష్మీ మండపం



















