శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ పెద్దపీట : ఈవో

పోలీస్ శాఖకు 20 బ్రెత్ అనలైజర్లు అందజేత

hellotelugu-EOTTD

తిరుప‌తి : శ్రీవారి దర్శనానికి తిరుమలకి విచ్చేసే లక్షలాది భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా టీటీడీ నిరంతరం చర్యలు చేపడుతోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం ఈవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖకు రూ.8 లక్షల విలువైన 20 బ్రీత్ అనలైజర్లను టీటీడీ తరఫున జిల్లా ఎస్పీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు.ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈ బ్రెత్ అనలైజర్లు కీలకంగా ఉపయోగ పడతాయని తెలిపారు. భక్తుల ప్రాణ రక్షణే టీటీడీకి అత్యున్నత ప్రాధాన్యమని, ఇందు కోసం పోలీస్ శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలు అందించేందుకు టీటీడీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్లు అత్యంత సున్నితమైనవని అన్నార‌. అక్కడ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంద‌న్నారు. టీటీడీ అందించిన ఈ ఆధునిక బ్రీత్ అనలైజర్లతో డ్రంకెన్ డ్రైవింగ్‌పై మరింత సమర్థవంతంగా నియంత్రణ సాధించ గలుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. భక్తుల భద్రతకు టీటీడీ అందిస్తున్న ఈ సహకారం అభినందనీయం అన్నారు. పోలీస్ శాఖ ఈ పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Exit mobile version