TTD EO : తిరుమల – తిరుమల వార్షిక బ్రహ్మత్సవాలకు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ). ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు టీటీడీ పవిత్ర స్వామి పుష్కరిణి పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత భక్తుల కోసం పుష్కరిణిని తిరిగి తెరిచినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు (TTD EO).
TTD EO Interesting Update
జూలై 20న ప్రారంభమైన మరమ్మత్తు పనులలో పాత నీటిని తీసివే యడం, పేరుకుపోయిన ఇసుకను, నాచును తొలగించారు. శుద్ధిని పూర్తి చేయడానికి వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుండి దాదాపు 100 మంది కార్మికులు 24 గంటలూ పనిచేశారు. పుష్కరిణి మెట్లను శక్తివంతమైన రంగులతో పెయింట్ చేశారు, దాని అందాన్ని పెంచారు. ఇప్పుడు దానిని దాదాపు కోటి లీటర్ల నీటితో నింపారు. పునరుద్ధరణ సమయంలో, రోజువారీ పుష్కరిణి హారతి నిలిపి వేశారు. భక్తులను పవిత్ర స్నానం కోసం అనుమతించలేదు. పనులు పూర్తయిన తర్వాత భక్తులు మళ్ళీ పుష్కరిణిలోకి ప్రవేశం కల్పించామన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతాయని వెల్లడించారు శ్యామల రావు . విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఉత్సవాలను సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 23న అంకురార్పణం, 24న ధ్వజారోహణం, 28న గరుడ సేవ ఉంటుందన్నారు. అక్టోబర్ 1న రథోత్సవం, 2న చక్ర స్నానం నిర్వహిస్తామన్నారు ఈవో.
రోజువారీ వాహన సేవలు ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటలకు జరుగుతాయని తెలిపారు. తీవ్రమైన యాత్రికుల రద్దీ కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.
Also Read : Thalapathy Vijay Shocking Comments : సీఎంను అంకుల్ అని పిలిస్తే ఎలా..?



















