సీఎంను క‌లిసిన టీటీడీ ఈవో ర‌విచంద్ర

తిరుమ‌ల ప్ర‌సాదం అందించిన వైనం

hellotelugu-TTDEO

అమ‌రావ‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ముద్దాడ ర‌విచంద్ర సోమ‌వారం అమ‌రావ‌తిలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం నారా చంద్రబాబు నాయుడును క‌లుసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో త‌న‌కు తిరుమ‌ల నుంచి ప్ర‌త్యేకంగా తీసుకు వ‌చ్చిన శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని, చిత్ర ప‌టాన్ని ముఖ్య‌మంత్రికి స్వ‌యంగా అంద‌జేశారు. ఇటీవ‌లే ఆయ‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి బ‌దిలీ అయ్యారు. ఇది ఊహించ‌ని విధంగా జ‌రిగింది. రాష్ట్రంలో అత్యంత నిజాయితీ క‌లిగిన ఉన్న‌తాధికారుల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు అనిల్ కుమార్ సింఘాల్. ఆయ‌న ఉమ్మ‌డి ఏపీలో గ‌ద్వాల జిల్లాలో స‌బ్ క‌లెక్ట‌ర్ గా ప్రారంభించారు. ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు.

ఇదే క్ర‌మంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఈవోగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో కూడా కొంత కాలంపాటు ప‌ని చేశారు. ఇదిలా ఉండ‌గా తిరిగి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో టీడీపీ కూట‌మి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా టీటీడీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ రాని ఛాన్స్ అనిల్ కుమార్ సింఘాల్ కు ద‌క్కింది. త‌న‌ను ఏరికోరి చంద్ర‌బాబు రెండోసారి టీటీడీకి ఈవోగా ప‌ని చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ అనుకోకుండా ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, దీనికి బాధ్యుడు సింఘాల్ అంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో త‌న‌పై వేటు వేశారు. ఆయ‌న స్థానంలో ముద్దాడ ర‌విచంద్ర‌ను నియ‌మించారు సీఎం.

Exit mobile version