TTD : తిరుమల : తిరుమలలో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అన్ని విభాగాల అధిపతులతో శుక్రవారం సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతో తొమ్మిది రోజుల పాటు సిఫార్సు లేఖలపై గదులను రద్దు చేశామన్నారు. ఈ కాలంలో ఆఫ్‌లైన్‌లో 3500 గదులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
TTD EO Anil Kumar Singhal Key Update for Brahmotsavams
ఈ సంవత్సరం భక్తులు వాహన సేవలు , ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను చూడటానికి 36 LED స్క్రీన్‌లను ఏర్పాటు చేశామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. గరుడ సేవ రోజు తప్ప 1.16 లక్షల ప్రత్యేక దర్శన టిక్కెట్ల, రోజుకు 25 వేల SSD టోకెన్లు ఇస్తామన్నారు. ఇక ఈ కాలంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేయడం జరిగిందన్నారు. VIP బ్రేక్ సెల్ఫ్ ప్రోటోకాల్ VIP లకు మాత్రమే పరిమితం చేశామన్నారు. రోజుకు 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్‌లో ఉంచామన్నారు. భక్తులకు సమాచారం అందించడానికి 20 హెల్ప్ డెస్క్‌లు (పది అదనంగా). ప్రతి గ్యాలరీలో ఉన్న భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించడానికి టిటిడి (TTD) రెగ్యులర్ అధికారులతో పాటు శ్రీవారి సేవకులను ప్రత్యేకంగా నియమించామన్నారు.
గరుడ సేవ రోజున గ్యాలరీలలో భక్తులకు 14 రకాల వస్తువులు వడ్డిస్తారని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం (MTVAC)లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్న ప్రసాదం వడ్డిస్తారని వెల్లడించారు అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలోని 24 పార్కింగ్ ప్రాంతాలలో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాలలో 2000 ద్విచక్ర వాహనాలు, 500 నాలుగు చక్రాల వాహనాలను ఉంచే అలిపిరి లింక్ బస్ స్టాండ్, 1000 , 300 ఉన్న నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్ , ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున వాహనాలను నిలిపేలా ఏర్పాట్లు చేశామన్నారు ఈవో.
తిరుపతిలోని పార్కింగ్ స్థలాలలో భక్తులను తిరుమలకు తీసుకెళ్లడానికి RTC బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర రోజులలో 1900 ట్రిప్పుల, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు నడుస్తాయన్నారు. 2000 టిటిడి భద్రత, నిఘా, వార్షిక ఉత్సవాల సమయంలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 4700 మంది పోలీసులతో పాటు 3500 మంది శ్రీవారి సేవకులు, 450 మంది టిటిడి సీనియర్ అధికారులు సేవలందిస్తారని చెప్పారు. 24X7 నిఘా నిర్వహించడానికి తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు 3000 సిసి కెమెరాలను అనుసంధానించడం జరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు డజనుకు పైగా అంబులెన్స్ సేవలు ఉంటాయన్నారు.
Also Read : TTD- SP Subbarayudu Interesting Update : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
















