పదో తరగతి పరీక్షల్లో టీటీడీ విద్యా సంస్థల రికార్డ్

విద్యార్థులు, టీచ‌ర్ల‌ను అభినందించిన ఈవో ర‌విచంద్ర‌

Hellotelugu-TTD10th

తిరుప‌తి : 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలోని విద్యా సంస్థ‌ల‌కు చెందిన విద్యార్థులు అద్బుత ఫ‌లితాలు సాధించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించారు జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న 9 ఉన్నత పాఠశాలలు తాజాగా వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ స్థానం సాధించాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఇందుకోసం కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రిని అభినంద‌ల‌తో ముంచెత్తారు.

ఏపీలోని టీటీడీకి చెందిన తొమ్మిది ఉన్నత పాఠశాలల నుండి 558 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 524 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 94 శాతం ఫలితాలు సాధించడం జరిగింది. ఇందులో ఎస్వీ ఉన్నత పాఠశాలలకు చెందిన కె.ఆమ‌ని, ఎస్‌.పి.బాలిక‌ల ఉన్నత పాఠశాలలకు చెందిన ఎస్‌.గీతికా రెడ్డి 587 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు . ఎస్జీఎస్ హైస్కూల్ కు చెందిన ద‌త్త‌సాయి చ‌రిష్మ‌ 584 మార్కులు, ఎస్‌కెఆర్ ఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూలు కు చెందిన కె.యోగేష్ 580 మార్కులు సాధించి ఆ పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు.

తాటితోపు ఉన్నత పాఠశాల విద్యార్థి పి.జ‌న‌ని 562 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారు. ఓరియంటల్ హైస్కూలు కు చెందిన ఎం.నాగ‌చైత‌న్య‌ 554 మార్కులు, తిరుమల ఎస్వీ హైస్కూలు కు చెందిన కె.వెంక‌ట‌క్రిష్ణ‌ 559 మార్కులతో ఆయా పాఠశాలల టాపర్ లు గా నిలిచారు. భీమ‌వ‌రం ఎస్వీ డెఫ్ ప్రత్యేక హైస్కూలు కు చెందిన బి.చైత‌న్య‌ కు 400 మార్కులకు 375 మార్కులు, తిరుప‌తి ఎస్వీ డెఫ్ ప్రత్యేక హైస్కూలు కు చెందిన ఇ.శ్రావ్య‌శ్రీ 400 మార్కులకు 373 మార్కులు సాధించి పాఠశాలల‌ టాపర్ గా నిలిచారు. ఈ రెండు పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.

టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర, జేఈవో డా.ఎ.శ‌ర‌త్‌ నేతృత్వంలో డిఈవో శ్రీ వెంక‌ట సునీలు స్వీయ పర్యవేక్షణలో అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదివించడంతో ఈ ఫలితాలు సాధ్యం అయ్యాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఈ ఫలితాల సాధనకు దోహదం చేసింది.

Exit mobile version