8వ తేదీ నుండి శ్రీ‌నివాస మంగాపురం బ్ర‌హ్మోత్స‌వాలు

ప్రోగ్రామ్ బుక్ లెట్ల‌ను ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్

hellotelugu-TTDChairman

తిరుమల : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించి ప్రోగ్రాం బుక్ లెట్ లను తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వర లక్ష్మీ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. 8వ తేదీన ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం, రాత్రి పెద్ద శేష వాహ‌నం, 9వ తేదీన ఉద‌యం చిన్న శేష వాహ‌నం, రాత్రి హింస వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు.

10వ తేదీన ఉద‌యం సింహ వాహ‌నం, రాత్రి ముత్య‌పు పందిరి వాహ‌నం, 11వ తేదీన ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి స‌ర్వ భూపాల వాహ‌నం, 12న ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం ( మోహినీ అవ‌తారం ) , రాత్రి గ‌రుడ వాహ‌నం, 13న ఉద‌యం హ‌నుమంత వాహ‌నం, మ‌ధ్యాహ్నం వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు), సాయంత్రం స్వర్ణరథం (సా. 4 నుండి 5 గంటల వరకు), రాత్రి గ‌జ వాహ‌నం, 14న ఉద‌యం సూర్య ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్రప్రభ వాహనం, 15న ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి అశ్వ వాహ‌నం, 16న ఉద‌యం చ‌క్ర స్నానం, (ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు), రాత్రి ధ్వ‌జా రోహ‌ణం ఉంటుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

Exit mobile version