TTD Chairman : తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో (TTD Chairman) పాటు ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జీఈవో వీర బ్రహ్మంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు టీటీడీ చైర్మన్, ఈవో. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు.
TTD Chairman BR Naidu Key Comments on Vaikuntha Dwara Darshan
డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు.
మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించామన్నారు. మొదటి మూడు రోజులకు సంబధించి శ్రీవాణి, ₹300 దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. టోకెన్లు ఆన్‌లైన్ ఈ-డిప్ ద్వారా మాత్రమే ఉంటాయన్నారు. జనవరి 2–8 తేదీల్లో రోజుకు 15,000 ప్రత్యేక ప్రవేశ టికెట్లు, 1,000 శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని పేర్కొన్నారు. ఈనెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి డిప్ ద్వారా కేటాయిస్తామన్నారు. ఈ సందర్బంగా వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్.
Also Read : KTR Challenge for Farmers : రైతుల సమస్యలు తీరేదాకా పోరాటం ఆగదు



















