Trump : అమెరికా – యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన అనారోగ్యానికి గురయ్యాడని, ఇక పరిపాలనా పరంగా పని చేయరంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది . ఆయన ఆరోగ్యంపై ఆందోళనల మధ్య ‘ట్రంప్ కనిపించడం లేదంటూ అనే పుకార్లు వ్యాపించాయి. ఇదే సమయంలో ఏమైనా జరగరానిది జరిగితే అమెరికా దేశ అధ్యక్షుడిగా తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు జేడీ వాన్స్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ (Trump) చాలా ఆరోగ్యంగా ఉన్నారని , మిగిలిన పదవీకాలం సేవ చేయగలరని స్పష్టం చేశారు.
Donald Trump Health Updates
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజల దృష్టి నుండి తప్పి పోయారనే పుకార్లు వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత, ఆయన తన మనవరాళ్లతో కై ట్రంప్, స్పెన్సర్ ట్రంప్ వైట్ హౌస్ దక్షిణ పచ్చికలో కనిపించారు. ట్రంప్ ఎక్కడ ఉన్నాడంటూ ట్రెండింగ్ కొనసాగుతోంది నెట్టింట్లో. ట్రంప్ ‘రోజంతా, ప్రతిరోజూ చేతులు దులుపుకోవడం’ వల్లే ఈ గాయాలయ్యాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. 79 ఏళ్ల అధ్యక్షుడికి దీర్ఘకాలిక సిరల లోపం (CVI) ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె చెప్పారు. అయితే, వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బరెల్లా ‘అద్భుతమైన స్థితిలో’ ఉన్నారని పేర్కొంటూ ఒక మెమో జారీ చేశారు.
Also Read : PM Modi India-China Mutual Trust Interesting : ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం ముఖ్యం
















