Beauty Trisha Krishnan : ప్రేమా క‌వ్వించ‌కే త్రిషా క‌రుణించ‌వే..!

డేటింగ్ చేస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం

Hello Telugu - Beauty Trisha Krishnan

Hello Telugu - Beauty Trisha Krishnan

Trisha Krishnan : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు త‌మిళ‌నాడు సినీ రంగానికి చెందిన న‌టుడు, రాజ‌కీయ పార్టీ నాయ‌కుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక న‌టుడు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఎక్క‌డ చూసినా త‌న గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణ‌న్. త‌ను త‌మిళం, తెలుగు సినిమాల‌లో కీ రోల్స్ పోషించింది. టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది. తాజాగా మ‌ణిర‌త్నం మూవీ థ‌గ్ లైఫ్ లో మెరిసింది. ఇది ఆశించిన మేర ఆడ‌లేదు.

Trisha Krishnan Dating Rumors

ఇదే స‌మ‌యంలో త‌ను పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా త‌ను విజ‌య్ తో డేటింగ్ చేస్తోందంటూ టాక్. సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. వీరికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ ఇద్ద‌రు చేసిన పోస్టులు చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా పుట్టిన రోజు సంద‌ర్బంగా త్రిష కృష్ణ‌న్ (Trisha Krishnan) ఓ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేసింది. హృద‌య పూర్వ‌క‌మైన సందేశాన్ని షేర్ చేసింది.

ఈ ఒక్క పోస్టుతో పాటు అరుదైన ఫోటోను పోస్ట్ చేయ‌డం మ‌రింత అనుమానాల‌ను రేకెత్తించేలా చేసింది. వీరు పూర్తిగా పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయార‌ని, ఎవ‌రినీ ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేరంటూ కామెంట్ చేస్తున్నారు సినీ వ‌ర్గాలు. త‌ను ప్రేమ గురించి వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. తాజాగా త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ విధంగా రాసింది. మీరు ప్రేమ‌తో నిండి పోయిన‌ప్పుడు దాని గురించి వ్య‌తిరేక‌త‌తో ఆలోచించే వారు గంద‌ర గోళానికి గురి చేస్తుందంటూ పేర్కొంది. ద‌ళ‌పతి 51వ పుట్టిన రోజు సంద‌ర్భంగా కంగ్రాట్స్ తెలిపింది. త‌న‌కు ప్ర‌త్యేక విందు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Also Read : Hero Nithin – Tammudu Movie :త‌మ్ముడు మామూలోడు కాదు

Exit mobile version