TPCC Chief : హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహమ్మద అజారుద్దీన్ మంత్రి పదవి గురించి మూడు నెలల ముందు గానే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. శుక్రవారం మహేష్ గౌడ్ (TPCC Chief) మీడియాతో మాట్లాడారు. అజారుద్దీన్ పైన ఎలాంటి కేసులు ఉన్నాయో, వాటి వివరాలు మీ వద్ద ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం కిషన్ రెడ్డి మరిచి పోయారా అని ప్రశ్నించారు. ఎంపీగా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై బీజేపీ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.
TPCC Chief Mahesh Kumar Goud Key Comments on Kishan Reddy
విచిత్రం ఏమిటంటే కిషన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఆయన పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం అజహరుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి. కాబట్టి ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. దీని వల్ల మైనారిటీలకు కొంత మేలు జరుగుతుంది అని భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా మహమ్మద్ అజహరుద్దీన్ క్రికెటర్ గా, కెప్టెన్ గా ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. తన హయాంలోనే పలువురు క్రికెటర్లను వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా మణికట్టు మాంత్రికుడిగా పేరు పొందాడు. తను ఆడే ఫ్లిక్కింగ్ షాట్స్ ఎప్పటికీ గుర్తుండి పోతాయి.
Also Read : Hero Yash Toxic Sensational : మార్చి 19న రానున్న యశ్ టాక్సిక్
















