America Independence : అమెరికా – ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన అమెరికా జూలై 4న శుక్రవారం ఇండిపెండెన్స్ (America Independence) డేను జరుపుకుంటోంది. ఇది 249వ స్వాతంత్ర దినోత్సవం. ఈ చారిత్రాత్మక సందర్భం అద్భుతమైనది. కొన్ని శతాబ్దాలుగా బ్రిటన్ ఆధిపత్యంలో కొనసాగింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఏ) . దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ యావత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఎందరో చేసిన బలిదానాలు, ఆత్మత్యాగాలు ఉన్నాయి. సుదీర్ఘ పోరాటల ఫలితమే నేటి స్వేచ్ఛకు దర్పణం.
America Independence Updates
హక్కుల కోసం చేసిన ఉద్యమాలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయి. ఇవాళ అమెరికా అత్యంత విస్తారమైన ఆర్థిక వ్యవస్థతో పాటు బలమైన, సమర్థవంతమైన సైనిక శక్తిని, ఆయుధ , అణ్వాయుధ సంపత్తిని కలిగి ఉంది. జాతి, అసమానత, రాజకీయ అనిశ్చితి ప్రస్తుతం నెలకొన్నా స్వేచ్ఛకు మాత్రం ఆ దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది వాస్తవం. విపరీతమైన స్వేచ్ఛ కొంత దారి తప్పింది. మానవ సమాజంలో కొంత అంతరాలను సృష్టించేందుకు దోహద పడేలా చేసింది.
చైనా మరియు రష్యా వంటి ప్రత్యర్థుల నుండి బాహ్య సవాళ్లు ఎదురవుతుండగా, అమెరికా తన ప్రపంచ నాయకత్వ పాత్రపై పరిశీలనను ఎదుర్కొంటోంది. 249వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి. జాతిని ఉద్దేశించి దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో మనందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు అమెరికాకు ఇండిపెండెన్స్ డే కంగ్రాట్స్ తెలిపారు. అమెరికా ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Also Read : Hydraa Commissioner Shocking Comments : నాలాలు పొంగొద్దు వరద ముంచెత్తొద్దు – హైడ్రా


















