Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాటపట్టాయి. గత రెండు వారాలుగా రూ.98,000 పరిధిలో ట్రేడవుతున్న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఈ రోజు ఉదయం రూ.99,700కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇది రూ.99,850గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం (Gold) ధరలు సైతం సగటున రూ.91,390 నుంచి రూ.91,540 వరకూ కనిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు తెలిపిన మేరకు, పసిడి ధరలు త్వరలోనే లక్ష మార్కును అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Gold Price Updates
హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు సుమారుగా రూ.99,700గా ఉండగా, కొన్నిచోట్ల కొద్దిపాటి తేడాతో ఇవి మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి మద్దతు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు వెండి ధర నెమ్మదిగాతగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కంటే వెండి ధరలు కేజీకి సుమారు వంద రూపాయల మేరకు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ.1,20,100గా నమోదవగా, ఢిల్లీ, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో ఇది రూ.1,24,900గా ఉంది. ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో మాత్రం వెండి ధరలు తక్కువగా, సుమారుగా రూ.1,14,900 వద్ద ఉన్నాయి.
పసిడి ధరల పెరుగుదల వెనుక రూపాయి-డాలర్ మారకం విలువ, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు, పెట్టుబడిదారుల మద్దతు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారులు ఈ ధరల మార్పులను గమనిస్తూ, కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను తెలుసుకుని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : ఆకాశాన్నంటిన పసిడి ధరలు



















