Gold : బంగారం కొనుగోలు చేసే వారికి షాక్ ఇచ్చే విధంగా దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆషాఢ మాసం ఉత్సవాలు, శ్రావణ మాసం వివాహాల సీజన్ నేపథ్యంలో ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి పెరగడంతో ధరలు పుంజుకుంటున్నాయి. జూన్ నెలాఖరులో వరుసగా తగ్గిన ధరలు, జూలై ప్రారంభం నుంచి మళ్లీ పెరుగుదల చూపుతున్నాయి. తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది.
Gold – వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి:
- దిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,050, 22 క్యారెట్ల ధర రూ.90,810. కిలో వెండి ధర రూ.1,09,900.
- ముంబై: 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660. వెండి ధర కిలోకు రూ.1,09,900.
- చెన్నై: 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660. వెండి ధర రూ.1,20,100.
- బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660. కిలో వెండి రూ.1,19,900.
- హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.98,900, 22 క్యారెట్ల బంగారం రూ.90,660. వెండి ధర రూ.1,19,900.
- విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల పసిడి రూ.98,900, 22 క్యారెట్ల ధర రూ.90,660. వెండి ధర రూ.1,19,900.
బంగారం ధరలు ఇలానే పెరుగుతాయా లేదా తిరిగి తగ్గుతాయా అన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ తరుణంలో కొనుగోలు ముందు తాజా ధరలపై ఓసారి వెరిఫై చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold and Silver Price : పసిడి ప్రియులకు ఇదో షాకింగ్ న్యూస్



















