Gold : గత కొన్ని వారాలుగా ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు జూన్ చివరి రోజున కొంత తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు పాక్షికంగా పడిపోవడంతో వినియోగదారులకు ఊరట లభించినట్టైంది.
జూన్ 30 (ఆదివారం) ఉదయం 6:30 గంటలకు నమోదైన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,410గా ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,290గా నమోదైంది. నిన్నటితో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది.
Today Gold and Silver Price
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్, విజయవాడ: 24 క్యారెట్లు – ₹97,410, 22 క్యారెట్లు – ₹89,290
ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹97,560, 22 క్యారెట్లు – ₹89,440
ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణే: 24 క్యారెట్లు – ₹97,410, 22 క్యారెట్లు – ₹89,290
వడోదర: 24 క్యారెట్లు – ₹97,460, 22 క్యారెట్లు – ₹89,340
వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ, వడోదర, అహ్మదాబాద్: ₹1,17,700
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా: ₹1,07,700
వెండి ధరల్లో కూడా కేజీకి సుమారు ₹100 మేర తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, వడ్డీ రేట్లపై ఊహాగానాలు ఈ ధరలపై ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు రోజూ మారుతుండటంతో, కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను స్థానిక జువెల్లరీ షాప్‌లో లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పరిశీలించడం మంచిది.
Also Read : Today Gold and Silver Price : వరుసగా 3వ రోజు తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు












