Gold : గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టాయి. ఇదే తరుణంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లైంది.
Gold – బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹98,720గా నమోదైంది. ఇది నిన్నటి ధర ₹98,730తో పోలిస్తే రూ.10 తగ్గిందని గమనించవచ్చు.
22 క్యారెట్ల బంగారం (Gold) ధర 10 గ్రాములకు ₹90,490గా ఉంది, ఇది నిన్నటి ధర ₹90,500తో పోలిస్తే రూ.10 తక్కువ.
18 క్యారెట్ల బంగారం మాత్రం ₹74,050 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
వెండి ధరల్లోనూ తగ్గుదల:
100 గ్రాముల వెండి ధర ₹12,000 నుండి ₹11,990కి తగ్గింది. అదే విధంగా కిలో వెండి ధర ₹1,20,000 నుండి ₹1,19,900కి పడిపోయింది.
పరినామాల ప్రభావం:
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, డాలర్ బలపడటం, గ్లోబల్ కమోడిటీ మార్కెట్లలో మార్పులు, డిమాండ్‌లో తగ్గుదల వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తహతహలాడుతున్న వినియోగదారులకు ఊరట:
ఇటీవల బంగారం ధరలు శరవేగంగా పెరుగుతుండటంతో, కొనుగోలుదారులు కొంత వెనకడుగు వేసారు. అయితే ఈ ధర తగ్గుదల తాత్కాలికమా లేక కొనసాగుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మార్కెట్ వర్గాల సూచన:
బంగారం కొనుగోలుపై ఆసక్తి ఉన్న వినియోగదారులు ధరలను ప్రతిరోజూ గమనిస్తూ, అవసరానికి అనుగుణంగా సరైన సమయంలో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
మొత్తం మీద, ఈ రోజు బంగారం, వెండి ధరల తగ్గుదల వినియోగదారులకు తాత్కాలిక ఊరట కలిగించినప్పటికీ, భవిష్యత్ ధరల దిశగా అవగాహనతో కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Today Gold and Silver Price : పసిడి ప్రియులకు మరోసారి షాకింగ్..మల్లి పెరిగిన ధరలు



















