Tirumala : అమరావతి – ఏపీఎస్ఆర్టీసీ భక్త బాంధవులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆధ్వర్యంలో విధి విధానాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకం గురించి పరిశీలించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల ఆదేశాల మేరకు ఎండీ కీలక ప్రకటన చేశారు. అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే పథకానికి ఆమోదం తెలిపింది.
Tirumala Free Bus Updates
ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు. ఈ పథకం ప్రముఖ దివ్య క్షేత్రంగా భాసిల్లుతూ కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న తిరుమలకు (Tirumala) వర్తించదంటూ బాంబు పేల్చారు. నిత్యం తిరుపతి నుంచి తిరుమలకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ ఫ్రీ బస్సు పథకం సప్తగిరి బస్సులలో నడవదంటూ పేర్కొన్నారు ఎండీ. తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండదన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం అమలు కానుందని తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్ కార్డులను చూపించి ఫ్రీగా జర్నీ చేయొచ్చని స్పష్టం చేశారు.
Also Read : Guvvala Balaraju Shocking Comments : బీఆర్ఎస్ లో నాలాంటి వాళ్లకు స్థానం లేదు

















