నాకు తెలియ‌కుండానే టికెట్ రేట్లు పెంచారు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

hellotelugu-KomatireddyvenkatReddy

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న సినీ రంగానికి సంబంధించి త‌న‌కు తెలియ‌కుండానే సినిమా టికెట్ రేట్లు పెంచారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం అఖండ‌-2 మూవీ. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా అటు ఏపీలో ఇటు తెలంగాణ‌లో ఆయా ప్ర‌భుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చాయి. ఈ సంద‌ర్బంగా తెలంగాణ‌కు సంబంధించి అఖండ -2 మూవీకి సంబంధించి త‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగింద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే మంత్రి స్వ‌యంగా ఇలా ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. దీంతో ఆయ‌న చేసిన కామెంట్స్ సినీ రంగంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇక ముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదన్నారు. హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారని ప్ర‌శ్నించారు. అఖండ 2 విషయంలో నాకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారంటూ ప‌రోక్షంగా సీఎం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. కాగా తాను గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో బిజీగా ఉంటే త‌న‌కు తెలియ‌కుండానే శాఖాధికారులు పొర‌పాటున పెంచేశారంటూ చెప్ప‌డం మ‌రింత విస్తు పోయేలా చేసింది. అస‌లు ఆయ‌న మంత్రిగా ఉన్నారా అన్న అనుమానం క‌లుగుతోంది.

Exit mobile version