గిల్ ను త‌ప్పించడం వెనుక ఆ ఇద్ద‌రు సెలెక్ట‌ర్లు

మ‌రోసారి తీసుకోవాల‌ని ప‌ట్టు ప‌ట్టిన గంభీర్, అగార్క‌ర్

helloteeluu-PragyanOjhaRPSingh

ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ తాజాగా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఎంపిక చేయ‌డం వెనుక భారీ త‌తంగం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతోంది. ఈ ఎంపిక క‌మిటీలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ తో పాటు ప్ర‌జ్ఞా ఓజా, ఆర్పీ సింగ్ తో పాటు బీసీసీఐ స‌భ్య కార్య‌ద‌ర్శి స‌భ్యులుగా ఉంటారు. గ‌త కొంత కాలంగా గంభీర్, అగార్క‌ర్ నిస్సిగ్గుగా ఒకే ఒక్క ఆట‌గాడు శుభ్ మ‌న్ గిల్ కోసం చాలా మంది ప్ర‌తిభావంతులైన ఆట‌గాళ్ల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింది. త‌న ఒక్క‌డి కోసం ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్టారు. చివ‌ర‌కు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది సెలెక్ష‌న్ క‌మిటీ. ఈ త‌రుణంలో పెద్ద ఎత్తున బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక క‌మిటీలో భారీ ఎత్తున వాదోప‌వాదాలు కొన‌సాగాయి. కానీ చివ‌ర‌కు తుది జ‌ట్టు ఎంపిక కావ‌డం క్లిష్ట‌త‌రంగా మార‌డంతో ఓటింగ్ కూడా వెళ్లేందుకు సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం.

శుభ్ మ‌న్ గిల్ ఆడినా ఆడ‌క పోయినా త‌ను ఆడాల్సిందేనంటూ ప‌ట్టు ప‌ట్టారు గౌత‌మ్ గంభీర్, అజిత్ అగార్క‌ర్ లు. గుడ్డిగా త‌నకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకించారు ఎంపిక క‌మిటీలో కీల‌కంగా ఉన్న స‌భ్యులైన మాజీ క్రికెట‌ర్లు ప్ర‌జ్ఞా ఓజా, ఆర్పీ సింగ్ . ఓటింగ్ వ‌ర‌కు వ‌చ్చే స‌రికి చెరీ స‌మానం అయ్యారు. దీంతో చివ‌ర‌కు ఓటింగ్ కు దిగాల్సి వ‌చ్చింద‌ని, ఈ స‌మయంలో శుభ్ మ‌న్ గిల్ వ‌ద్దంటూ బీసీసీఐ స‌భ్య కార్య‌ద‌ర్శి చివ‌ర‌కు ఓజా, సింగ్ ల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో 3-2 తేడాతో చివ‌ర‌కు తుది జ‌ట్టును ఎంపిక చేయాల్సి వ‌చ్చింది. ఈసారి టి20 జ‌ట్టులో కీల‌క‌మైన మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ముగ్గురు ఆట‌గాళ్లు శాంస‌న్, కిష‌న్ , రింకూ సింగ్ మ‌రోసారి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌ధానంగా శాంస‌న్ రావ‌డం వెనుక ఓజా, సింగ్ లు ఉన్నార‌ని తేలి పోయింది.

Exit mobile version