తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా కీలక ప్రకటన చేసింది టీటీడీ. ఈ సందర్బంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసిందన్నారు. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనదని తెలిపారు. ఈ కారణంగా 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. దీనిని గమనించి భక్తులు సహకరించాలని కోరారు ఈవవో ముద్దాడ రవిచంద్ర.


















