Gira Gira Gingira Gire : ఛాంపియన్ మూవీలోని లేటెస్ట్ సాంగ్ గిరా గిరా గింగిరాగిరే (Gira Gira Gingira Gire) దుమ్ము రేపుతోంది. కెవ్వు కేక అంటున్నారు పాటల ప్రేమికులు. అచ్చమైన పల్లెతనం వెల్లి విరిసేలా చిత్రీకరించారు నృత్య దర్శకుడు. తెలంగాణకు చెందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్ కలం నుంచి జాలు వారింది జానపదం ఝల్లుమనిపించేలా చేసింది. ఈ పాటను హృదయాలను హత్తుకునేలా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు కూర్చారు. గుండెను మీటేలా చేశాడు. గిర గిరా గింగిరాగిరే పాటను రామ్ మిరియాల పాడారు. సోనీ మ్యూజిక్ దీనిని విడుదల చేసింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు రోషన్, అనస్వర. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
Gira Gira Gingira Gire Song Sensational
ఇప్పటికే టాప్ లో కొనసాగుతుండడంతో ఇంకా విడుదల కాని ఈ సినిమాపై మరింత అంచనలు పెంచేలా చేశాయి.కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం అంతా ప్రదీప్ కావడం విశేషం. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిమ్స్ బ్యానర్ పతాకంపై ఛాంపియన్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు ప్రియాంక దత్, జికె మోహన్, జెమినీ కిరణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎక్కడా తగ్గకుండా సినిమాను అత్యంత రిచ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి చాలా కష్టపడ్డాడు ఈ పాట కోసం. మొత్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది గిర గిర పాట.
Also Read : PM Modi Interesting Comments : 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం
https://www.youtube.com/watch?v=VXSK2S8Aq0Q
