ప్రైవేట్ వ్య‌క్తుల వ‌ద్ద రుణాలు తీసుకునే ప‌రిస్థితి రాకూడ‌దు

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రు ప్రైవేట్ వ్య‌క్తులు రుణాలు తీసుకునే ప‌రిస్థితి రాకూడ‌ద‌ని అన్నారు. సచివాలయంలో ముగిసిన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం జ‌రిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని స్ప‌ష్టం చేశారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని పిలుపునిచ్చారు.. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని స్ప‌ష్టం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు.

డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయని, రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడే అన్ని రంగాల్లో బడుగులూ ఎదుగుతార‌ని చెప్పారు. బడుగుల కోసం ప్రభుత్వాలుగా మేం చేయాల్సింది చేస్తున్నామ‌ని, అయితే బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందేన‌ని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని , పేద-ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం అన్నారు.

Exit mobile version