ముంబై : నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ముంబై వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్. మొన్నటికి మొన్న కోల్ కతా వేదికగా విండీస్ ను ఉతికి ఆరేసి సెమీస్ కు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు శాంసన్. ఇదే సమయంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో సైతం తన వంతు ఆట ఆడాడు. జోఫ్రా ఆర్చర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కు చుక్కలు చూపించాడు. తను కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొని 89 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇవాళ సమిష్టి గా ఆడి విజయం సాధించామని చెప్పాడు మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్.
తను చేసిన కీలక పరుగులకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్వంతం చేసుకున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తను వ్యక్తిగత స్కోర్ పై ఎక్కువగా దృష్టి పెట్టనని చెప్పాడు. తాను టీం కోసం ఆడతానని అన్నాడు. ఈ అవార్డుకు తనకు కాదని జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వాలని అన్నాడు. తాజాగా తను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇది టీం స్పిరిట్ అంటే అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఈ ఇన్నింగ్స్ కూడా తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నాడు సంజు శాంసన్. అదృష్టం నాతో ఉంది. కాబట్టి నేను జట్టు కోసం ముందుకు సాగుతూనే ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని అన్నాడు కేరళ స్టార్ క్రికెటర్.



















