బెంగళూరు : ఇప్పుడు అందరి కళ్లు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఇండియన్ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీపైనే ఉంది. అయితే ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్ము రేపుతోంది. సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు టీం రెడీ అయ్యింది. ఈ తరుణంలో టాక్సిక్ మూవీకి సంబందించి అశ్లీలత శృతి మించిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు నటుడు యష్. అశ్లీలత తప్పు అని అంగీకరస్తూనే తమ సినిమా ఆ హద్దును దాటలేదని స్పష్టం చేశాడు. యష్ , కియారా అద్వానీల మధ్య సన్నిహిత దృశ్యాలు ఉన్న ‘తబాహి’ పాటపై వచ్చిన విమర్శల గురించి ఇటీవల ఆయనను అడిగారు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ పాట వీడియోను కండోమ్ ప్రకటనతో పోల్చారు.
‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు యష్ ఆ పోలికను నవ్వుతూ కొట్టిపారేశారు. నేను ఒకవేళ కండోమ్ ప్రకటన చేయాల్సి వస్తే, డబ్బు కోసమే చేస్తాను. ఉచితంగా చేయను అని ఆయన అన్నారు. ‘టాక్సిక్’ చిత్రంలో సన్నిహిత సన్నివేశాలు, లైంగికతకు సంబంధించిన విస్తృత చర్చపై కూడా ఆయన స్పందించారు. శృంగార భరితమైన ఆకర్షణకు , అశ్లీలతకు మధ్య ఉన్న తేడా తనకు తెలుసని, తమ సినిమా ఆ హద్దును దాటలేదని యష్ నొక్కి చెప్పారు. అశ్లీలత తప్పు. మీరు గమనిస్తే, నేను కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఒక నిర్దిష్టమైన హద్దు ఉంటుంది, అది మాకు తెలుసు. దృశ్యాలను కళాత్మకంగా చిత్రీకరించాలి. చివరకు కంటికి ఇంపుగా కనిపించేదే సినిమా ప్రభావం, సృష్టికర్త యొక్క దృక్పథం అని ఆయన పేర్కొన్నారు. ‘టాక్సిక్’ చిత్రం ప్రధానంగా నేటి యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించ బడిందని, పాత తరం, సంప్రదాయాలు ,స్థిరపడిన సామాజిక నియమాల గురించి యువత అడిగే ప్రశ్నలను ఇది చర్చిస్తుందని యష్ వివరించారు. ఇదిలా ఉండగా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది టాక్సిక్.

















