మావిగ‌న్ పేరు వింటే చంద్ర‌బాబుకు భ‌యం

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

hellotelugu-YSJagan

తాడేప‌ల్లిగూడెం : తాను ప్ర‌తిపాదించిన మావిగ‌న్ అంటే చంద్ర‌బాబు వ‌ణుకుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. బీపీ కూడా ఈ మ‌ధ్య బాగా పెరింద‌న్నారు. పెట్రోలు, డీజిలు ధరలు షాక్‌ ఇస్తున్నాయి. అధికారంలోకి రాగానే రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. ఇదే విష‌యాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. కానీ త‌గ్గించ‌క పోగా ఉన్న‌ప‌ళంగా దెబ్బ మీద దెబ్బ వేస్తున్నార‌ని వాపోయారు. పెట్రోలు, డీజిలు మీద రాష్ట్ర పన్నులను ఎందుకు తగ్గించడం లేద‌ని ప్ర‌శ్నించారు. మరి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కదా అని అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని ఎందుక‌ని ప్ర‌శ్నించారు . సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు మోసాలుగా మిగిలి పోయాయని ఎద్దేవా చేశారు. కాని, అన్నీ అమలు చేసేశామంటూ, పత్రికల్లో ఫ్రంట్‌ పేజీలో ప్రకటనలు ఇస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరూ ఉండరన్నారు జ‌గ‌న్ రెడ్డి.

చంద్రబాబు పలానా మంచి ప్రజలకు చేశానని చెప్పుకునే పరిస్థితిలో లేరని , అందుకనే డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ భ‌గ్గుమ‌న్నారు. అందుకే గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని, డైవర్షన్‌ పాలిటిక్స్‌ని మొదలుపెట్టాడు. ప్రజలు అమాయకులు కాదు, చైతన్య వంతులు:
ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందిందీ అన్నా, ప్రతి పేదవాడి నోట్లోకి నాలుగువేళ్లూ వెళ్లాయన్నా అది వైయస్సార్‌ పాలన, జగనన్న పాలనలోనేని తెలుసుకుంటే మంచిద‌న్నారు. మేం సాధ్య‌మైనంత వ‌ర‌కు మంచి చేసే ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు.

Exit mobile version