మలేషియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ మలేషియా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆదివారం ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక్కడ తమిళులు అధికంగా నివసిస్తుంటారని అన్నారు.
ఇబ్రహీంతో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో మనలో చాలా మందిలాగే మలేషియా ప్రధాని కూడా ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని అని తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారతీయ సంతతి సమాజం ఇక్కడ కొలువుతీరి ఉన్నారని చెప్పారు. ఎక్కువగా తమిళులు, మలేషియాలో ఉందన్నారు.
మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో మనలో చాలా మందిలాగే, తన మలేషియా ప్రతిరూపమైన అన్వర్ ఇబ్రహీం కూడా ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని కావడం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇదిలా ఉండగా భారత నాయకుడికి ఇచ్చిన విందులో తమిళ నటుడి నాలై నమదే సినిమాలోని ఒక పాటను ప్రదర్శించారు. ఎంజీఆర్ అని పిలవబడే మరుదూర్ గోపాలన్ రామచంద్రన్, ఒక ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు , నిర్మాత. ఆయన తమిళనాడుకు చెందిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీని స్థాపించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1987లో మరణించారు.
