ముంబై : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సంచలనంగా మారాడు. మెస్సీ గోట్ టూర్ లో భాగంగా తను భారత దేశంలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చాడు. తొలుత కోల్ కతా కు చేరుకున్నాడు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే మ్యాచ్ ఆడక పోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్టేడియంలో గందరగోళం చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించారు సీఎం మమతా బెనర్జీ. ఇప్పటికే నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా లియోనెల్ మెస్సీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఫలక్ నుమా లో ఆతిథ్యం లభించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు లియోనెల్ మెస్సీ. హైదరాబాద్ నగరం ప్రేమ కలిగిన సిటీ అని ప్రశంసించారు. మీ ప్రేమను తాను ఎన్నటికీ మరిచి పోలేనని అన్నారు. ఘనంగా వీడ్కోలు పలికారు ఫుట్ బాల్ దిగ్గజానికి. ముంబై వాంఖడే స్టేడియంకు చేరుకున్న మెస్సీకి ఊహించని రీతిలో స్వాగతం లభించింది. ఆయన అంతులేని సంతోషానికి లోనయ్యారు. ఇదే క్రమంలో ప్రముఖ నటులు అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ తో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ రమేష్ టెండూల్కర్ , సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు తన భార్య కూడా మెస్సీని కలిశారు. జెర్సీని ఇచ్చి పుచ్చుకున్నారు సచిన్, మెస్సీ. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు వైరల్ గా మారారు సోషల్ మీడియాలో.


















