అమ‌రావ‌తి రాజ‌ధాని చ‌రిత్ర భావిత‌రాల‌కు తెలియాలి

శాస‌న స‌భ‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌

hellotelugu-AnithaVangalapudi

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తికి ఇక ఢోకా లేద‌ని అన్నారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శ‌నివారం రాష్ట్ర రాజ‌ధానిగా తీర్మానం ప్ర‌వేశ పెట్టారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా స్పందించారు అనిత‌. సీఎం స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌క‌త్వం ఏపీకి ఒక వ‌రం అని అన్నారు. అమరావతి రాజధాని అనేది ఒక చరిత్ర అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు. అమరావతి రాజధాని విషయంలో మహిళలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. వారు చేసిన ఉద్య‌మం ఫ‌లించింద‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

అమరావతి రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చేశారని కొనియాడారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా 1,631 రోజులు రైతులు పోరాడార‌ని కితాబు ఇచ్చారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం జరిగిన పోరామ‌ని పేర్కొన్నారు. చంటిబిడ్డను ఎత్తుకుని కొందరు, గర్భిణీలు, వృద్ధులు కూడా పోరాడార‌ని అన్నారు. అమరావతిని కాపాడుకున్న చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. ఆనాడు జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో దారుణంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళలను పోలీసులతో కొట్టించారు..జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని వాపోయారు .కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నా అడ్డుకుని ఇబ్బంది పెట్టార‌ని అన్నారు. మహిళలు కట్టుకున్న చీరలను కూడా కామెంట్ చేశారన్నారు.

Exit mobile version