హెచ్ -1బి వీసా విధానాన్ని ర‌ద్దు చేయాలి

అమెరికా దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వ్యాన్స్

hellotelugu-JDVaance

వాషింగ్ట‌న్ : అమెరికా దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వ్యాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు హెచ్ -1బి వీసా జారీ విధానం ప‌ట్ల‌. ఇది పూర్తిగా విఫ‌లం అయ్యిందంటూ ఆరోపించారు. అందుకే తక్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను ఆకర్షించడానికి బదులుగా తక్కువ వేతనాలకు లభించే విదేశీ శ్రామికులతో అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేయడానికి కార్పొరేట్ సంస్థలు హెచ్ -1బి విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని వాన్స్ పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు ఈ విధానాన్ని ఉపయోగించి అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం తీసుకునే విదేశీ సిబ్బందిని నియమించు కుంటున్నందున దీనిని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని ఆయన కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సాంకేతిక సంస్థలు, అకౌంటింగ్ రంగాలు, ఇతర అనేక రంగాలలో ఈ వ్యవస్థ ‘పూర్తిగా దుర్వినియోగం’ చేయబడిందని వాన్స్ నొక్కి చెప్పారు. అత్యుత్తమ అంతర్జాతీయ ప్రతిభావంతులను నియమించుకోవడానికి , కేవలం కార్మిక ఖ‌ర్చుల‌ను తగ్గించు కోవడానికి హెచ్ 1బి అనుమతులను ఉపయోగించు కోవడానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆయన ఎత్తిచూపారు. సంవత్సరానికి $60,000 సంపాదిస్తున్న అమెరికన్ అకౌంటెంట్ స్థానంలో, సంవత్సరానికి $45,000 సంపాదించే అకౌంటెంట్‌ను మీరు తీసుకు వస్తున్నట్లయితే, ఒక మేధావిని తీసుకు రావడానికి మీరు ఆ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నట్లు కాదు అని వాన్స్ అన్నారు.

Exit mobile version