పెద్దశేష వాహనంపై శ్రీ కోదండ రాముడి దివ్య వైభవం

చెక్కభజనలు, కోలాటాలతో భగవన్నామ స్మరణ

hellotelugu-PeddaSeshaVahaanam

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి ఆనందపరిచారు. గజ రాజులు ముందుండగా, భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో భగవన్నామ స్మరణలో మునిగి పోయి స్వామి వారిని కీర్తించాయి. మంగళ వాయిద్యాల నాద స్వరంతో వాహన సేవ ఎంతో భక్తి భావంతో, కోలాహలంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి వారి కటాక్షాన్ని పొందారు.

పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు, “నా భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను” అనే సందేశాన్ని ప్రసాదించారు. భక్తులు శేషుని వలె నిత్య సేవకులై, భగవత్ కృపను పొంది సత్ఫలితాలు సాధించాలని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మార్చి 18న ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version