తిరుపతి : శ్రీ గోవిందరాజ స్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదే విధంగా ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామి వారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు జేఈవో వీరబ్రహ్మం. మరో వైపు ఏపీ సర్కార్ ఇప్పటికే ఉన్న జేఏఈలకు కాకుండా మరో జేఈవోను నియమించింది. తనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక సీనియర్ అధికారి అయి ఉండి సభా వేదిక సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కాడు. ఆ తర్వాత పదవి పట్టాడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా టీటీడీ రాజకీయ నాయకులకు వేదిక కావడం చర్చకు దారి తీసేలా చేసింది.



















