చెన్నై : తమిళనాడులో డీఎంకే కూటమి సర్కార్ కు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డీఎంకే చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్,
తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై, మా కూటమిలోని ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఈరోజు కాంచీపురం-చెంగల్పట్టు బహిరంగ సభలో పాల్గొన్నారు. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు డీకే శివకుమార్.
ప్రజల ఉత్సాహం, మా కూటమిపై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని అన్నారు డిప్యూటీ సీఎం. ఈ పురోగతిని కొనసాగించడానికి తమ కూటమి ఐక్యంగా నిలుస్తుందని స్పష్టం చేశారు . ప్రజలు అందించిన అఖండ మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. మనం కలిసి ముందుకు సాగే క్రమంలో ఈ శక్తి మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమితో పాటు టీఎంకే విజయ్ లాంటి పార్టీలు ఎన్ని వచ్చినా డీఎంకే కూటమి దరిదాపుల్లోకి రాలేవని ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచు కోబోతున్నామని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులో టీవీకే విజయ్ కి అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు 10 సీట్లు కూడా రావన్నారు.

















