అమరావతి : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష చేపట్టారు. సమీక్షలో పాల్గొన్న ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి,ప్రాజెక్టు సిఈ,ఎస్‌ఈ,ఈఈలు. ఈ సందర్బంగా నిమ్మల రామా నాయుడు సమీక్షస్తూ చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ శత విధాలుగా ప్రయత్నం చేస్తోందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా సీఎం నారా చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో 40 శాతంకు పైగా పనులు పూర్తి చేస్తే, వైసిపి పాలనలో పూర్తిగా పనులను నిలిపి వేశారని సంచలన ఆరోపణలు చేశారు నిమ్మల రామానాయుడు. ఎన్జీటి 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించినా వైసిపి ప్రభుత్వం పట్టించు కోలేదని మండిపడ్డారు. జగన్ పాలనా నిర్లక్ష్యం కారణంగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో 90 రోజుల పాటు 53.50 టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్ట్ ను గతంలో తమ సర్కార్ రూపొందించడం జరిగిందన్నారు నిమ్మల. చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తి చేసి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల మెట్టప్రాంతాలకు సాగు, తాగు నీరందిస్తామని ప్రకటించారు.
