అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెస్ క్రీడాకారిణి హింపి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ఏపీకి చెందిన హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించినందుకు అభినందనలతో ముంచెత్తారు. ఈ కాంస్య పతకం ప్రత్యేకంగా చెప్పుకోదగినదని పేర్కొన్నారు సీఎం. ఎందుకంటే ఐదు ప్రపంచ ర్యాపిడ్ పతకాలు సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారని ప్రశంసించారు. ఫిడే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతంగా తన ప్రతిభను ప్రదర్శించిందని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పతకాలు సాధించాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా 11 రౌండ్ల తర్వాత హంపీ 8.5 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించింది, చైనాకు చెందిన జు జినర్ , రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్కినాతో సమానంగా నిలిచింది. అయితే, బుక్‌హోల్జ్ , ప్రత్యర్థి రేటింగ్‌లతో సహా టై-బ్రేక్‌ల తర్వాత ఆమెకు కాంస్య పతకం లభించింది, ప్లేఆఫ్ తర్వాత గోర్యాచ్కినా టైటిల్‌ను గెలుచుకుంది. తోటి భారత క్రీడాకారిణి బి. సవిత శ్రీతో చివరి రౌండ్‌లో డ్రా చేసుకోవడం వల్ల 2019 , 2024లో విజయాల తర్వాత హంపీ తన మూడవ ర్యాపిడ్ ప్రపంచ కిరీటాన్ని గెలుచు కోలే కపోయింది. హంపీ నిరంతర శ్రేష్ఠత, పట్టుదలను ప్రశంసించారు. ఫిడే ప్రపంచ ర్యాపిడ్ కాంస్య పతకం ప్రపంచ స్థాయి విజయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భారతదేశంలోని లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

















