అన్ని చోట్లా ఛాంపియ‌న్ కు ఆద‌ర‌ణ

కొన్నిచోట్ల సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న

hellotelugu-ChampionCollection

ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన మూవీ ఛాంపియన్. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కాస‌ర్ల రాసిన పాట దుమ్ము రేపుతోంది. మిక్కీ జే మేయ‌ర్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. సినీ ప్రేక్ష‌కుల‌ను టాకీసుల వ‌ద్ద‌కు వ‌చ్చేలా చేసింది. తొలి రోజు భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ సినిమాకు ముందు నుంచి మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి, న‌టుడు నాని, ఇత‌రులు కూడా. ఇందులో న‌టించిన న‌టుడు ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్, ఊహ‌ల ముద్దుల త‌న‌యుడు కావ‌డం విశేషం. ఇదే స‌మ‌యంలో మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది అన‌స‌ర్వ రాజ‌న్. త‌ను ఇందులో కీ రోల్ పోషించింది.

అంతే కాదు అచ్చం తెలుగుంటి అమ్మాయిలా త‌న‌కు ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేసింది. త‌ను చేసిన డ్యాన్స్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను క‌దిలించేలా చేసింది. కాస‌ర్ల శ్యాం రాసిన గిర గిర గింగిరానివే అన్న పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని రామ్ మిర్యాల పాడాడు. మిక్కీ అద్భుత‌మైన స్వ‌రాలు కూర్చాడు. తొలి రోజు భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇవాళ రూ. 1.5 కోట్లు సాధించింది. మొద‌టి రోజు రూ. 2. 5 కోట్లు సాధించింది. ఛాంపియ‌న్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా తోడ్పాటు అందించారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో పాటు ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో పెళ్లి సంద‌డిలో న‌టించాడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ మేక‌. చాలా కాలం త‌ర్వాత ఛాంపియ‌న్ గా ముందుకు వ‌చ్చాడు.

https://www.youtube.com/watch?v=7gvB7JN4hJc

Exit mobile version