కేసీఆర్ తెలంగాణ మోడల్ కు ‘కేంద్రం’ ఫిదా

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎకనామిక్ స‌ర్వే -2026

hellotelugu-TelanganaKCR

న్యూఢిల్లీ : ఓ వైపు గ‌త 10 ఏళ్ల కేసీఆర్ తెలంగాణ పాల‌నా కాలంలో అంతులేని అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా మ‌రో వైపు త‌న కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల‌లో , ప్ర‌త్యేకించి వ్య‌వ‌సాయ రంగం కొత్త పుంత‌లు తొక్కిందంటూ సాక్షాత్తు కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని ఎక‌నామిక్ స‌ర్వే -2026 స్ప‌ష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెంపు పెట్టు అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా ఎక‌నామిక్ స‌ర్వే కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు గొప్ప‌వ‌ని, దీని కార‌ణంగానే రాష్ట్రంలో ప‌రుగులు పెట్టిందంటూ పేర్కొంది. కేవ‌లం 9 ఏళ్లలో 90 లక్షల ఎకరాల కొత్త సాగు విస్తీర్ణం ఏర్పడిందని ఎకనామిక్ సర్వే 2026లో వెల్లడించింది.

కాళేశ్వరం, మిషన్ భగీరథతో 1.31 కోట్ల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింద‌ని తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారాలను పటాపంచలు చేసింది ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టు .కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచింద‌ని కితాబు ఇచ్చింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కేటీఆర్ తీసుకొచ్చిన “వీ హబ్” పై కూడా ప్రశంసలు కురిపించింది. అంతే కాకుండా 9 ఏళ్లలో తయారీ రంగం ఉపాధిలో 5% వాటాతో పెద్ద రాష్ట్రాలకు పోటీ ఇచ్చింద‌ని పేర్కొంది. దేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్నప్పటికీ, తయారీ రంగంలో టాప్ 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంద‌ని, 9 ఏళ్లలో సేవా రంగంలో అగ్ర రాష్ట్రాల సరసన నిలిచింద‌ని ప్ర‌శంసించింది కేంద్ర ఎక‌నామిక్ స‌ర్వే .

Exit mobile version