యువ శక్తి బడ్జెట్ గా కేంద్రం రూపకల్పన

కొత్త ఆలోచనలు, స్టార్టప్ లకు ప్రాధాన్యం

hellotelugu-Budget2026

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ స‌ర్కార్ ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్ 2025-26ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా ఉద్యోగ కల్పన కోసం యువతకు ప్రోత్సహం దిశగా బడ్జెట్ రూప‌క‌ల్పన చేశారు. కర్తవ్య గ్రోత్ కింద 7 రంగాల్లో శక్తివంతమైన ప్రోత్సహకాలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉపాధి, ఉద్యోగాలు సృష్టించటం, చిన్న, మధ్య తరహాల పరిశ్రమల్లో ఛాంపియన్ గా మార్చ‌డం, పరిశ్రమల్లో 350 సంస్కరణలు అమలు చేయటం. పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచే విధంగా తయారీ రంగాలను శక్తివంతంగా మార్చటం, మౌళిక సదుపాయల కల్పనను యుద్ధ ప్రాతిపదికన కల్పించటంపై ఫోక‌స్ పెట్టింది యూనియ‌న్ బ‌డ్జెట్.

ఏడు వ్యూహాత్మక రంగాల్లోను శక్తివంతంగా తయారు చేయటం లక్ష్యంగా బడ్జెట్ ప్రోత్సహకాలు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు నిర్మ‌లా సీతారామ‌న్. ఇదే స‌మ‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు . బయో ఫార్మా శక్తి పథకం తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లల్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామ‌న్నారు. క్యాన్సర్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ నిధులు ఖ‌ర్చు చేస్తామ‌ని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి. బయో ఫార్మా శక్తి కింద ఆరోగ్య భారతం దిశగా చర్యలు తీసుకుంటామ‌న్నారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఆర్థిక మంత్రి. ఇందు కోసం ప్ర‌త్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి నిధి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రూ. రూ.10 వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించామ‌న్నారు.

Exit mobile version