వరంగల్ జిల్లా : వన దేవతలు సమ్మక్క, సారలమ్మలు వీర వనితలు అని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చరిత్ర చెదిరిపోకుండా, సంస్కృతి సాంప్రదాయం వర్ధిల్లేలా, భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అయ్యేలా, ఆచారాలు శాశ్వతంగా నిలిచేలా సమ్మక్క – సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్లైనా నిలిచి పోయేలా మేడారంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను సహచర మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు రేవంత్ రెడ్డి. తన జీవితంలో మరిచి పోలేని అనుభూతి ఇక్కడ పొందానని చెప్పారు. తాము గతంలో చెప్పిన విధంగానే పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు సీఎం.
నాగోబా జాతర ఐక్యత, సమానత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు ప్రకృతితో సాన్నిహిత్యంగా జీవించే ఆదివాసీ జీవన విధానం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు రేవంత్ రెడ్డి. నాగోబా జాతర ద్వారా ఆదివాసీ సంప్రదాయాలు, కళలు, ఆచారాలు మరింతగా వికసించాలని ఆకాంక్షించారు. నాగోబా జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని ఆశీస్సులతో ఆదివాసీ ప్రజల జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు.



















