ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బంధం బ‌లీయ‌మైన‌ది

ద‌ర్శ‌కుడు బాబీ తీవ్ర‌మైన భావోద్వేగం

hellotelugu-Bobby

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడు బాబీ. త‌ను మెగాస్టార్ తో మూవీ తీశాడు. తాజాగా త‌న సోద‌రుడు , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసిన క్ష‌ణాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం ప‌వ‌న్ ది అని పేర్కొన్నారు ద‌ర్శ‌కుడు బాబీ. ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం క‌లిగింద‌ని తెలిపాడు. ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు.

రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయి పోయానన‌ని పేర్కొన్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. చివరగా ఒక్క మాట చెబుతున్నానని, జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశానని తెలిపాడు.

 

Exit mobile version