ముంబై : బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ను శనివారం ముంబై బీసీసీఐ కార్యాలయంలో ప్రకటించింది. వన్డే సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , బీసీసీఐ కార్యదర్శి సైకియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎలాంటి అంచనాలు లేకుండానే కొందరిని, తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జనవరి 11న వడోదరలోని బీసీఏ స్టేడియంలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో జరగబోయే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది.
అత్యంత పేలవమైన పూర్ పర్ ఫార్మెన్స్ కనబర్చిన ప్లేయర్లను ఎంపిక చేయడం తో మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందులో టి20 జట్టుకు కెప్టెన్ గా ఉన్న తనను తప్పించారు. అందరూ సంతోషపడ్డారు. చివరకు మరోసారి వన్డే సీరీస్ లో ఎంపిక చేసి తమ ఈగోను కనబర్చారు. ఇక జట్టు పరంగా చూస్తే భారత వన్డే జట్టు ఇలా ఉంది. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.



















